విద్యుత్ అక్రమ వినియోగంపై జరిమానా
కృష్ణా: విద్యుత్, శాఖ విజిలెన్స్ అధికారులు సోమవార తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్వాసు పర్యవేక్షణలో సూపరింటెండింగ్ చిరంజీవి, ఈఈ గోవిందరావు 33 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్టారు. మొత్తం 3,023 గృహ సర్వీసులు, 163 వాణిజ్య సముదాయాలు తనిఖీ చేయగా, వీటిలో 255 సర్వీసుల్లో అదనపు లోడ్ నమోదు కావడంతో రూ.4,38,800 జరిమానా విధించారు.