మరోసారి దర్శకుడిగా విశ్వక్ సేన్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గతంలో 'ఫలక్‌నుమా దాస్' సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అతడు దర్శకుడిగా మారనున్నాడు. మాజీమంత్రి తలసాని కుమారుడు సాయి నిర్మాతగా 'కల్ట్' అనే మూవీని విశ్వక్ చేస్తున్నాడు. ఈ సినిమాకి విశ్వక్‌నే దర్శకత్వం వహించడం గమనార్హం. కాగా, ఇటీవల రెండు సినిమాలు విశ్వక్‌కు మంచి ఫలితాలు ఇవ్వలేదు.