'హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి'

KMM: ఖమ్మం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచించారు. గురువారం ఖమ్మం ట్రంక్ రోడ్‌లో నిర్మాణంలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను కమిషనర్ తనిఖీ చేశారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అలాగే హెల్త్ సెంటర్లో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటాలని సూచించారు.