వినాయక చవితి సందడి షురూ

వినాయక చవితి సందడి షురూ

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో వినాయక చవితి వేడుకలకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రతిష్ఠాపకులు సిద్ధమయ్యారు. దీంతో రంగురంగుల గణేశ్ విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. వివిధ ఊర్లకు, కాలనీలకు విగ్రహాలను వాహనాల్లో తరలిస్తున్నారు. విగ్రహాలు 8 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు ఆకట్టుకునే విధంగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు.