పచ్చదనం పరిశుభ్రతతోనే సుస్థిరాభివృద్ధి : MPDO
KDP: గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రతతోనే ప్రజలకు స్థిర అభివృద్ధి కలుగుతుందని,గ్రామాల్లో పచ్చదనం - పరిశుభ్రతతో ప్రజలందరూ మెలగాలని MPDO ఫణి రాజకుమారి అన్నారు. ఇవాళ సిద్ధవటంలోని స్థానిక MPDO సభా భవనంలో పరిశుభ్రత పచ్చదనంపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలు అభివృద్ధి చెందేలా చూసుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని MPDO తెలిపారు.