వనజ గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ
PPM: జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ మాధవరెడ్డి మృతదేహాలను పరిశీలించి, వైద్యులతో మాట్లాడారు. ఆనంతరం ఘటన జరిగిన గృహాన్ని సందర్శించి, చుట్టూ ప్రక్కల వారిని వాకబు చేశారు. మృతికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.