అరకు కాఫీ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే
E.G: ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో ప్రభుత్వం DRDA SERP వారి సహకారంతో ఏర్పాటు అరకు కాఫీ షాపును గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. స్థానిక మహిళా సంఘాల సాధికారతకు, స్వయం ఉపాధి అవకాశాల పెంపుకు ఈ అరకు కాఫీ షాప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం డ్వాక్రా CAలకు ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లను పంపిణీ చేశారు.