ఆత్మహత్యకు పాల్పడుతున్న వ్యక్తిని కాపాడిన పీసీ

MHBD: జిల్లా కేంద్రంలో స్థానిక కురవి గేటు వద్ద రైల్వే ట్రాక్ పై శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోతుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. పరకాలకు చెందిన రామకృష్ణ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పాపలాల్ అతడిని కాపాడి, టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. స్థానికులు కానిస్టేబుల్‌ను అభినందించారు.