VIDEO: కారు చెట్టుని ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి
HNK: ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామశివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను పార్శ సంపత్, బొంపల్లి కిషన్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.