రూ. 79.79 లక్షల CMRF చెక్కుల పంపిణీ
KDP: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాధవి 82 మందికి రూ. 79,79,695 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.