కబడ్డీ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతి అందజేత

కర్నూలు: ఆదోనిలో వివేకానంద జయంతి, సంక్రాత్రి పండుగను పురస్కరించుకొని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల నాయకులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా పట్టణంలో బీరప్పనగర్‌లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీనివాసులు, భరత్ తదితరులు పాల్గొన్నారు.