న్యుమోనియాపై అవగాహన కార్యక్రమం
AKP: అచ్యుతాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం న్యుమోనియాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ శ్రామ్ మాట్లాడుతూ.. న్యుమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అని, ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ కారణంగా వస్తుందని ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. చికిత్స, వ్యాక్సినేషన్ ద్వారా దీన్ని నివారించుకోవచ్చునన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.