'కృషి ఉంటేనే విజయం'

'కృషి ఉంటేనే విజయం'

GDWL: గ్రామీణ క్రీడాకారులు కృషి, పట్టుదలతో జాతీయ స్థాయిలో రాణించాలని బీజేపీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆకాంక్షించారు. ​కార్తీక పౌర్ణమి సందర్భంగా బింగిదొడ్డిలో ఆదివారం గ్రామ స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలతో స్నేహ, సోదర భావాలు పెంపొందుతాయని, ఓడిన క్రీడాకారులు నిరాశ చెందకుండా గెలుపుకై ప్రయత్నించాలని సూచించారు.