కాల్పులు విరమణ చర్చలు అవసరం లేదు: ట్రంప్

కాల్పులు విరమణ చర్చలు అవసరం లేదు: ట్రంప్

ఇరాన్‌తో కాల్పుల విరమణపై చర్చలు జరపాలనుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళాన్ని నాశనం చేసినట్లు చెప్పారు. సైనిక పరంగా టెహ్రాన్ పని అయిపోయిందని పేర్కొన్నారు. తమ దాడుల్లో శత్రు దేశం కోలుకోలేనంతగా దెబ్బతిందన్నారు. అలాంటప్పుడు చర్చలు అవసరం లేదని వెల్లడించారు. హర్మూజ్ జలసంధి గురించి అమెరికాకు ఎలాంటి అవసరం లేదని వ్యాఖ్యానించారు.