VIDEO: 'మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
JGL: మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్, అనుబంధ గ్రామం రఘురాముల కోటకు కలిపి రూ.20 లక్షలతో రెండు మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, సర్పంచ్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.