బాలకృష్ణను కలిసిన హిందూపురం రూరల్ కన్వీనర్
SS: హిందూపురం రూరల్ మండల టీడీపీ కన్వీనర్ రాము హైదరాబాద్‌లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కలిశారు. తన కుమార్తె వివాహ మహోత్సవానికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.