VIDEO: స్విమ్మింగ్ పూల్‌లో పడి యువకుడు మృతి
SDPT: స్విమ్మింగ్ పూల్‌లో పడి యువకుడు మృతి చెందిన ఘటన గజ్వేల్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొలిచేలిమి వంశీ(25) అనే యువకుడు స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లి ప్రమాదవాశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనకు స్విమ్మింగ్ పూల్ యాజమాన్యమే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.