VIDEO: లారీ దగ్ధం.. భారీ శబ్దం
RR: కొత్తూరు మండలం పెంజెర్ల సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బాణసంచా లారీకి విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలోని బాణసంచా పేలడంతో ఆ ప్రాంతమంతా భారీ శబ్దాలతో దద్దరిల్లింది. లారీ పూర్తిగా అగ్నికి ఆహుతవ్వగా, బాణసంచా నిరంతరాయంగా పేలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తృటిలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.