పాతబస్తీ ఏరియాల్లో.. ఏంటి పరిస్థితి..?

HYD: పాతబస్తీ ఏరియా రహదారుల్లో వాహనాలు నడపడమే కష్టం. ఇరుకైన గల్లీలలో మరో సమస్య తోడైంది. గార్బేజి వ్యర్ధాలు మోతీ దర్వాజా, బకి చరోస్తా, బాతేనగర్ లాంటి అనేక ప్రాంతాల్లో రోడ్లపై కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పాతబస్తీ ఏరియాలో శానిటేషన్ జరగటం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.