పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఘన నివాళులు
TPT: వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర పటాలకు తాహసీల్దార్, ఎంపీడీవోలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.