డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలు పరిష్కరించాలి

SRD: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు డిమాండ్ చేశారు. సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద సమస్యలను శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ లేకపోవడంతో ఇక్కడి వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని అర్పించారు.