రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం రోడ్డు రజాక్ ఫంక్షన్ హాల్ సమీపంలో గల పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అమరేష్ అనే యువకుడు స్నేహితుడిని కలిసి వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.