ఉత్సాహంగా సాగిన సందెపురాళ్ల పోటీలు..!

ఉత్సాహంగా సాగిన సందెపురాళ్ల పోటీలు..!

NRPT: కృష్ణ మండలం గుడెబల్లూర్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం సందెపురాళ్ల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ బరువులున్న రాళ్లను ఎత్తేందుకు గ్రామ యువకులు పోటీపడ్డారు. విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు ప్రకటించారు. ఈ విన్యాసాలను తిలకించేందుకు భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.