బలహీన వర్గాల అభ్యున్నతికి టీడీపీ స్థాపన: బూరుగుపల్లి
E.G: నిడదవోలులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంఛార్జ్ బూరుగుపల్లి శేషారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని ఆవిర్భావం చేశారని వెల్లడించారు. పార్టీ స్థాపించి తొమ్మిది నెలలకే అధికారం ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.