అందరి భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి: ఎంపీపీ

NDL: ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి అన్నారు. బుధవారం బేతంచెర్లలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది, మండల అధికారులకు పంచాయతీ పురోగతి సూచిక 1.0 నుంచి 2.0 వరకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.