టీబీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలి: గవర్నర్

టీబీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలి: గవర్నర్

WGL: క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనకు పకడ్బందీ ప్రణాళికతో కలెక్టర్‌లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ చర్యలు చేపట్టాలని గవర్నర్ జిష్ణు దేవ్ అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపై రెండు జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు.