శ్రీలంక పర్యటనకు గద్వాల క్రికెటర్ ఎంపిక
GDWL: గద్వాలకు చెందిన క్రికెటర్ టి.అరుణ్ కుమార్ శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యారు. మార్చి 15 నుంచి శ్రీలంకలో జరగనున్న సిరీస్‌లో ఆయన ఆడనున్నారు. ఈ సందర్భంగా శనివారం MLA కృష్ణమోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అరుణ్ కుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. గద్వాల ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో వెలగడం గర్వకారణమని MLA పేర్కొన్నారు.