హత్య కేసుపై ఎస్పీ మీడియా సమవేశం
GDWL: గద్వాల శేరెల్లి వీధికి చెందిన బలిజ లక్ష్మి హత్య కేసు వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ.2,33,500 నగదు, ఐఫోన్, TS 33-C-5838 నంబరు గల స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాటు పడి రామిరెడ్డి అనే వ్యక్తి ఈ నెల 2న బలిజ లక్ష్మీని హత్య చేసి ఆమె మెడలోని బంగారం దొంగిలించాడన్నారు.