VIDEO: లబ్ధిదారులతో ఆనందం పంచుకున్న ఎమ్మెల్యే
WGL: గీసుకొండ మండలం గంగాదేవిపెల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వీట్లు పంపిణీ చేసి, శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల కళ్లలో ఆనందం నింపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.