రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం

రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం

మిజోరంలోని ఐజ్వాల్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బైరబీ-సైరాంగ్ రైల్వేలైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీంతో భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో ఐజ్వాల్ అనుసంధానం ఏర్పడింది. సైరాంగ్ నుంచి ఢిల్లీ, గౌహతి, కోల్‌కతాకు మూడు కొత్త రైళ్లను మోదీ ప్రారంభించారు.