పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
JGL: గొల్లపల్లి మండలంలోని లొత్తునూరులో గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని 167 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. రైతులు పశువుల ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పశువైద్య సిబ్బంది మనోజ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్ గౌడ్, పశువైద్య సిబ్బంది నరహరి, అజీజ్, తదితరులు పాల్గొన్నారు