50 మందికి కార్నియా మార్పిడి.. మరికొందరు వెయిటింగ్..!
HYDలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి దాదాపు 50 మందికి కార్నియా మార్పిడి చేసి కొత్త జీవితం ప్రసాదించినట్లు వైద్యులు తెలిపారు. మరో 50 మంది వరకు నిరీక్షణ జాబితాలో ఉన్నారు. తాజాగా ఆర్టీసీతో ఆసుపత్రి ఒప్పందం కుదుర్చుకోగా.. గ్రామీణ ప్రాంతాల్లో స్వీకరించిన కార్నియాలను సరోజిని దేవి ఆసుపత్రికి చేర్పించేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయన్నారు.