NHRCCF జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా సల్మా

CTR: నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్‌లో చిత్తూరు జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా పుంగనూరుకు చెందిన సల్మా నియామకమయ్యారు. ఈ క్రమంలోనే నియామక పత్రాన్ని NHRCCF చైర్మన్ మాదేష్ బుధవారం పంపారు. ఆమె మాట్లాడుతూ.. సంఘంలో మహిళలకు సాధికారత కల్పించడంలో, మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానని తెలిపారు.