VIDEO: మర్రిపూడిలో ఊపందుకున్న కందులు కొనుగోళ్లు
ప్రకాశం: మర్రిపూడి మండలం చిమట సహకార సొసైటీ ద్వారా ప్రభుత్వం కందుల కొనుగోలు కార్యక్రమం వారం నుంచి జరుగుతోంది. సమీప గ్రామాల ప్రజలు పండించిన కందులను క్వింటా రూ. 8 వేలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. బయట మార్కెట్లో వ్యాపారస్థులు రూ. 7,200కు కొనుగోలు చేస్తున్నారు. ధరల మధ్య వ్యత్యాసం ఉండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు వైపు ఆసక్తి చూపుతున్నారు.