రామగుండం కమిషనరేట్‌లో పర్యటించిన నూతన డీసీపీ

రామగుండం కమిషనరేట్‌లో పర్యటించిన  నూతన డీసీపీ

PDPL: రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి జోన్ నూతన డీసీపీ భూక్యా రామ్ రెడ్డి పర్యటించారు. ఏసీపీ ఎం.రమేష్‌తో కలిసి గోదావరిఖని సబ్ డివిజన్ లోని 2 టౌన్, కమాన్ పూర్, రామగిరి, మంథని, ముత్తారం పోలీస్ స్టేషన్లను పరిశీలించారు. కేసుల స్థితి, లా అండ్ ఆర్డర్, పెండింగ్ కేసులు, సీసీ కెమెరాలు, పెట్రోలింగ్, డయల్ 100 స్పందనపై సమీక్ష చేసి సిబ్బందికి సూచనలు ఇచ్చారు.