విజయవాడలో విస్తృతంగా వాహన తనిఖీలు...
NTR: విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం సీఐ లక్ష్మీనారాయణ ఎస్సై సౌజన్య వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.