అలర్ట్.. నగరానికి వర్ష సూచన..!
HYD: నగర ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి వర్షాలు పడనున్నట్లు HYD వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. దీంతో మహా నగరంలో వర్షపాతం ఉంటుందని పేర్కొంది. వర్షాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.