VIDEO: వైన్స్ షాపును ఏర్పాటు చేయవద్దంటూ నిరసన
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ చౌరస్తా (బ్లాక్ స్పాట్) జోన్ లో ఏర్పాటు చేసిన వైన్స్‌ను రద్దు పరచాలని స్థానికులు నిరసన తెలిపారు. శరణ్య గ్రీన్ హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చిన్నారులు, కుటుంబాలతో సహా సుమారు వంద మంది కి పైగా ఆదివారం అద్దంకి - నార్కెట్ పల్లి హైవే పైకి చేరుకొని సుమారు గంట పాటు ధర్నా చేశారు.