'ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించండి'
SKLM: ఆమదాలవలస మండలం వంజంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ఎంఈవో కేఏ రాములు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లో విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.