'కౌన్సిలర్ గా ఒకసారి అవకాశం ఇవ్వండి'
VKB: తాండూర్ కౌన్సిలర్‌గా ఒకసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ 19వ వార్డు అభ్యర్థి జుంటుపల్లి వెంకటేష్ కోరారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఆయన తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హస్తం గుర్తుకు ఓటు వేస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.