అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

జనగామలో మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. లింగాలఘనపురం(M) కళ్లెంకి చెందిన పడిదె పారిజాతంకు పదేళ్ల క్రితం రాజుతో వివాహమైంది. దంపతులు గణేష్వాడలో నివసిస్తున్నారు. ఇటీవల గొడవలు జరుగుతుండగా గురువారం రాత్రి తగాదా సమయంలో పారిజాతం అపస్మారక స్థితికి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.