8 అడుగుల నంది.. ఆ ఊరే ఓ గుడి

HYD: నగర శివారు నందివనపర్తి ఆలయాలకు పుట్టినిల్లు. నాడు నూటొక్క నందులు ఉండేవని, ఓంకారేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం, ఏకశిలా నంది ఇక్కడ ప్రధానమైనవని గ్రామస్థులు చెబుతారు. ఏకశిలా నంది ఆలయంలో 8 అడుగుల నంది విశేషంగా ఆకర్షిస్తోంది. హనుమాన్, జ్ఞాన సరస్వతి టెంపుల్స్ కూడా ఉన్నాయి. దీంతో నందివనపర్తి ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రంగా వెలుగొందుతుంది. HYD నుంచి అక్కడికి గంటలో చేరుకోవచ్చు.