నకిలీ మద్యం కేసులో రిమాండ్ పొడగింపు
AP: నకిలీ మద్యం కేసులో నిందితులకు ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 25 వరకు రిమాండ్ పొడగించింది. నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జోగి రమేష్, రామును పోలీసులు వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. మరోవైపు జైల్లో తనకు ములాఖత్‌లు పెంచాలంటూ జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు.