రేపు ఉచిత కంటి వైద్య శిబిరం
NDL: కొలిమిగుండ్లలో పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ గోపాల్ వెల్లడించారు. ఐ మిత్ర కంటి సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఇప్పటివరకు 10,800 మందికి ఉచితంగా శాస్త్ర చికిత్సలు చేసినట్లు ఆయన తెలిపారు. మండలంలో వివిధ గ్రామాల నుంచి వృద్ధులు తరలివచ్చి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.