అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుదాం: ఎమ్మెల్యే కూనంనేని

BDK: నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగుదామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ మండల పరిధి దంతలబోర, సంగం, నాగారం తదితర గ్రామాలలో సుమారు నాలుగు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాసిరకం పనులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.