రోడ్డుపై చదువుతూ నిరసన

రోడ్డుపై చదువుతూ నిరసన

KMM: ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ఖమ్మంలో శుక్రవారం విద్యార్థులు రహదారిపై కూర్చుని చదువుతూ నిరసన తెలిపారు. ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ఎదుట విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర విద్యార్థుల పట్ల లేదని విమర్శించారు.