VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,000, కొత్త మిర్చి ధర రూ.19,300, అటు క్వింటా పత్తి ధర రూ.7,300గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.300, కొత్త మిర్చి ధర రూ.25, పత్తి ధర రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.