WWC 2025: ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరే!
మహిళల వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. రేపు ముంబై వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఎలోసీ షేరిడాన్, జాక్వెలిన్ విలియమ్స్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ వెల్లడించింది. సూ రెడ్‌ఫెర్న్ థర్డ్ అంపైర్‌గా, నిమాలి పెరీరా ఫోర్త్ అంపైర్‌గా పనిచేస్తారని తెలిపింది. మిచెల్లి పెరీరా మ్యాచ్ రిఫరీగా ఉంటారని పేర్కొంది.