VIDEO: బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది

MLG: జిల్లా కేంద్రంలో శుక్రవారం మంత్రి సీతక్క నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలిపారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.