పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ

WNP: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నందున సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోనే ప్రజావాణి సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణకుగాను జిల్లావ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.